Breaking News

కోరపల్లి గ్రామం ఎల్లమ్మ దేవాలయంలో అర్ధరాత్రి చోరీ

కోరపల్లి గ్రామం ఎల్లమ్మ దేవాలయంలో అర్ధరాత్రి చోరీ

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామం ఎల్లమ్మ దేవాలయంలో గత రాత్రి చోరీ జరిగింది. ఆలయ తాళాలు పగులగొట్టిన దుండగులు లోపలికి ప్రవేశించి హుండీ పగులగొట్టి హుండీ లో ఉన్న నగదుతో పాటు భక్తులు సమర్పించిన కానుకలు ఎత్తుకెళ్లారు. ఉదయం దొంగతనం జరిగిన విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

No comments